భక్తిభావంతో ముత్యాల తలంబ్రాల ఊరేగింపు

TEJA NEWS

భక్తిభావంతో ముత్యాల తలంబ్రాల ఊరేగింపు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్థానిక శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు భక్తిభావంతో జరిగింది. ముందుగా టిటిడి పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో టిటిడి అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముత్యాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు ఆనందకుమార్‌ దీక్షితులకు అందించారు. అక్కడినుండి అంబారీపై ముత్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్ , ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top