TEJA NEWS

చేవెళ్ళ నియోజకవర్గం:

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను అందజేసిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ..

ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం పదిసార్లు నియోజకవర్గ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు అందజేయడం జరిగింది, ఈ విడుతలో 80 మంది లబ్ధిదారులకు
34 లక్షల 96 వేల రూపాయల విలువ గల చెక్కులను అందజేయడం జరిగింది …

అనంతరం టయోటా మోటార్స్ వారి ఏర్పాటుచేసిన గ్రామీణ ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన శాసనసభ్యులు కాలే యాదయ్య ..

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్ , మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS