బడిబాట కార్యక్రమం ర్యాలీ నిర్వహించి – అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

TEJA NEWS

బడిబాట కార్యక్రమం ర్యాలీ నిర్వహించి – అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

సాక్షిత : మోతె మండలం రావిపహాడ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువజన నాయకుల సహకారంతో బడిబాట కార్యక్రమం మహా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇల్లిళ్ళు తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, నైతిక విలువలతో కూడిన ఉత్తమ విద్యను అందిస్తామని ఉపాధ్యాయులు భరోసా కల్పించారు.
ర్యాలీ అనంతరం ఇటీవల నూతనంగా ఆవిష్కరించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు పాపిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ అతి పేదరికంలో పుట్టి ఉన్నత చదువులు సాధించడం అసాధారణమని కొనియాడారు.

అసమానతలతో కూడిన దేశానికి రాజ్యాంగం ద్వారా దిశానిర్దేశం చేస్తూ సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికతత్వం వంటి విలువలను అందించారని గుర్తు చేశారు. నేటి విద్యార్థులకు అంబేద్కర్ ఆదర్శమని, ఆయన ఆశయ సాధనలో భాగంగా గ్రామ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాయకపు పరమేష్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు పొడపంగి నాగరాజు, వార్డు సభ్యులు దిలీప్, హరిబాబు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top