ఇటీవల నూతనంగా ప్రతిష్టించబడిన శ్రీ నవగ్రహ సహిత పంచముఖి ఆంజనేయ స్వామి

Spread the love

ఇటీవల నూతనంగా ప్రతిష్టించబడిన శ్రీ నవగ్రహ సహిత పంచముఖి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న స్థానిక కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్…..

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ మహాదేవపురం డివిజన్ పరిధిలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఇటీవల నూతనంగా ప్రతిష్టించబడిన శ్రీ నవగ్రహ సహిత పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పంచముఖి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు..

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కి శాలువాతో సత్కరించి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు…

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద్ దుగ్యాల, రవీందర్ రెడ్డి, దిలీప్ కుమార్, సింహాచలం, వెంకట్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాధాకృష్ణ సత్యనారాయణ, సత్యం తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top