డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ… సంక్షేమ పాలనకు నిదర్శనం… –మార్కపురి సూర్య

TEJA NEWS

డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ… సంక్షేమ పాలనకు నిదర్శనం……

–మార్కపురి సూర్య….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: ఎల్బీనగర్ 41వ. డివిజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డ్వాక్రా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ ఫ్లోర్ లీడర్, 41వ. డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

గత పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఆడబిడ్డల కోసం తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందించడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా డ్వాక్రా మహిళలు భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ నాయకులు రాణవేణి సుధీర్, పోతరాజు నాగరాజు, మెప్మా ఆర్పీలు స్వర్ణలత, భాగ్య, సరోజనతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top