జన జాతీయ గరిమా ఉత్సవానికి శ్రీకారం….

TEJA NEWS

జన జాతీయ గరిమా ఉత్సవానికి శ్రీకారం….

మంథని బట్టుపల్లిలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రారంభం….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జన జాతీయ గరిమా ఉత్సవం–2026” (జన భాగీదారి అభియాన్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 18 నుంచి 25 వరకు బట్టుపల్లి గ్రామంలో గిరిజన ప్రజల కోసం ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు వంద శాతం చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా ఆధార్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు, పీఎం జనధన్ యోజన, అటవీ హక్కుల చట్టం పట్టాలు, రేషన్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు వంటి సేవలతో పాటు ఉచిత ఆరోగ్య సేవలు కూడా అర్హులైన ప్రతి గిరిజన లబ్ధిదారునికి అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గిరిజన ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top