పెంచిన ఇంధన ధరలు తగ్గించాలి

TEJA NEWS

పెంచిన ఇంధన ధరలు తగ్గించాలి….

గోదావరిఖనిలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ గోదావరిఖని పైలాన్ చౌరస్తా వద్ద సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పలకలు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు ఈ నరేష్ మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు ముగిసిన వెంటనే ఐదు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయని, దీంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బి అశోక్, జీ మల్లేశం, ఐ రాజేశం, పి ఓ డబ్ల్యూ నాయకురాలు డి బుచ్చమ్మ, ప్రజా సంఘాల నాయకులు లింగయ్య, దుర్గయ్య, ఐలయ్య, మల్లికార్జున్, ప్రేమ్ కుమార్, కవిత, ఆర్ లక్ష్మి, పి సుగుణ, ఎం రమ, వినోద, మంజుల తదితరులతో పాటు సుమారు 50 మంది పార్టీ, ప్రజాసంఘాల సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top