
సరళ సాగర్, కురుమూర్తి రాయ, నెల్విడి లిఫ్టుల పునరుద్దరునకు నిధులు మంజూరు……… ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
వనపర్తి :
దేవరకద్ర నియోజకవర్గం లోని ప్రధాన ఎత్తిపోతల పథకాలైన సరళ సాగర్, కురుమూర్తి రాయ, నెల్విడి లిఫ్టులు కాలక్రమేన శిథిలావస్థకు చేరాయి, గత ప్రభుత్వాన్ని ఆయకట్టు రైతులు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన లిఫ్టులను పట్టించుకోలేదు తద్వారా పంటల సీజన్ లో లిఫ్టుల ద్వారా పంట పొలాలకు నీళ్లు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలో జియంఆర్ ఎత్తిపోతల పథకాలను స్వయంగా పరిశీలించి, దానికి సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం అందజేశారు.
ఈ ప్రతిపాదనలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
సరళ సాగర్ లిఫ్ట్ పునరుద్ధరణకు 1 కోటి 94 లక్షల 20 వేలు.*
కురుమూర్తి రాయ లిఫ్ట్ పునరుద్ధరణకు 1 కోటి 45 లక్షల 20 వేలు.
*నెల్విడి లిఫ్ట్ పునరుద్ధరణకు 92 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందనీ
దేవరకద్ర ఎమ్మెల్యే .జి. మధుసూదన్ రెడ్డి తెలుపుతూ.. లిఫ్టుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు, అదేవిధంగా త్వరలోనే లిఫ్టుల పునరుద్ధరణ మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటామని రాబోయే వర్షాకాలం నాటికి లిఫ్టుల మరమ్మత్తులు పూర్తిచేసి ఆయకట్టు రైతాంగానికి నీరు అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
