కోదాడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…..

TEJA NEWS

కోదాడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు……
జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ.

కోదాడ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్టణ ప్రజలకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చిందని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో కోదాడ పట్టణం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల సహకారంతో మౌలిక వసతుల కల్పనతో పాటు పట్టణ సుందరీకరణకు మున్సిపల్ పాలకమండలి నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో పట్టణాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top