ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్

TEJA NEWS

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ (ZC) శ్రీ పి. పింకేష్ కుమార్ గాజులరామారం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డిప్యూటీ కమిషనర్ (DC) వెంకట్రాములు, డిప్యూటీ డైరెక్టర్ అర్బన్ బయోడైవర్సిటీ (DD UBD), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (DEEs) మరియు మేనేజర్ పాల్గొన్నారు. మొక్కలు నాటిన అనంతరం స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో కలిసి జోనల్ కమిషనర్ పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు.ఈ పర్యటనలో భాగంగా, జోనల్ కమిషనర్ గాజులరామారం మరియు దేవేందర్ నగర్‌లోని శ్మశాన వాటికలను తనిఖీ చేశారు. అక్కడ ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టి, కనీస ప్రాథమిక వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం హెచ్.ఎమ్.టి (HMT) సొసైటీ మరియు రోడా మేస్త్రీ నగర్ ‘బి’ లలో ప్రస్తుతం సాగుతున్న జనగణన పనులను జోనల్ కమిషనర్ పరిశీలించారు. జన గణన ప్రక్రియను మరింత వేగవంతం చేసి, జూన్ 9వ తేదీ కల్లా పూర్తి చేయాలని అక్కడ ఉన్న ఎన్యూమరేటర్లను ఆదేశించారు.

You cannot copy content of this page

Scroll to Top