
ఇస్రో శాస్త్రవేత్తగా మూడున్నర దశాబ్దాల వెంకటేశ్వర్లు సేవలు అభినందనీయం…………… సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
వనపర్తి :
ఇస్రో లో అంతరిక్ష శాఖ శాస్త్రవేత్త గా వెంకటేశ్వర్లు దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాల పాటు సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఇస్రో శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు ను సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్‌గౌడ్ ఆదివారం షాద్ నగర్ పట్టణం ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ పనిని దైవంగా భావించి వృత్తి ధర్మాన్ని చిత్త శుద్ధితో నిర్వహించారని, ఏనాడు విధుల పట్ల నిర్లక్ష్యం చూపలేదని కొనియాడారు.ఇస్రో సైంటిస్ట్ గా అంతరిక్షం డిపార్ట్ మెంట్ లో మాంచి పేరు సంపాదించుకొని మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన తన శాస్త్రవేత్త గా జీవితంలో ఉత్తమ వ్యక్తిత్వంతో బాధ్యతాయుతంగా పని చేశారని అన్నారు.ఆయన ఇస్రో అంతరిక్ష విభాగం కు అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం ఉన్నతాధికారుల ప్రశంసలూ
కూడా అందుకున్నారని వివరించారు*. పలుస శంకర్ గౌడ్ శైలజ దంపతులు వెంకట్రాములు పద్మ దంపతులను శాలువ జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.