సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వర్కర్స్ పెండింగ్ వేతనాలను చెల్లించాలనీ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు

TEJA NEWS

సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వర్కర్స్ పెండింగ్ వేతనాలను చెల్లించాలనీ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు

ఎన్నికల వాగ్దానాలు ఏమో కానీ జీతాలు చెల్లించాలని లేకుంటే ఉద్యమిస్తామని …..సిఐటియు జిల్లా అధ్యక్షులు R N రమేష్ హెచ్చరిక
వనపర్తి :

వనపర్తి జిల్లా సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వర్కర్స్ 10 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ప్రజావాణి లో కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ఖీమా నాయక్ కి సిఐటియు హాస్టల్ వర్కర్స్ యూనియన్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు R N రమేష్ మాట్లాడుతూ హాస్టల్ వర్కర్లు వీరంతా మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు, చెందిన వారే అత్యధికులుగా ఉన్నారు, వీరికి ఇలాంటి చట్టబద్ధత సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కనీసం గ్యారంటీ సూరిటి లేని వేతనం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం చేయలేదు, 10 నెలల నుంచి వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని, ఇప్పుడు విద్యాసంస్థల ప్రారంభం కావడం జరిగింది. పిల్లల చదువులకు ఇబ్బందులుగా ఉన్నాయని, వానకాల సీజన్ ప్రారంభమవుతా ఉంది పనుల పెట్టుబడులకు, కుటుంబం అవసరాల రిత్య కూడా గడవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అమలు చేయడంలో మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏమోగానీ చేసిన పనికి సంబంధించిన జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్మికులను సంఘటితం చేసి అధికారులపై, ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రజినీకాంత్, అలివేలమ్మ, రంగమ్మ, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top