
బద్రు నాయక్ ను పరామర్శించిన………..
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి
వనపర్తి
వనపర్తి మండలం చిన్న గుంట పల్లి తాండకు చెందిన బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ తండ్రి బద్రు నాయక్ అనారోగ్యంతో హైందవ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాస్పిటల్ కి వెళ్లి బద్రు నాయక్ ను పరామర్శించారు. డాక్టర్ తో బద్రు నాయక్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని బద్రు నాయక్ కి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటావని బద్రు నాయక్ కు ధైర్యం చెప్పారు.
పరామర్శించిన వాళ్ళు వనపర్తి మండల్ NSUI అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు నందిమల్ల రామ్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
