
ప్రతి ఓటు విలువైనదే- దొంగ ఓట్లకు ఆస్కారం ఇవ్వకండి
భారత్ భారతీయ జనతా పార్టీ బి ఎల్ ఎ-2ల కోవూరు నియోజకవర్గ సమావేశం
కోవూరులోని కన్యకా పరమేశ్వర దేవస్థానం పక్కన గల శ్రీరాములు శెట్టి కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, బి ఎల్ ఏ-1 కాసా శ్రీనివాసులు అధ్యక్షతన కోవూరు నియోజకవర్గం బి ఎల్ ఏ-2 ల సమావేశం జరిగినది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డిపాల్గొన్నారు. సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ..భారత ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్ ను బిఎల్ఎ 2లు, బిఎల్వోలతో కలసి ప్రతి ఇంటికి పోయి ఫారాల పంపిణీలో పాల్గొని ఎస్సీ ఆర్ నిర్వహించాలని, దానిలో బిఎల్ఎ టులు నిర్వహించవలసిన పాత్ర గురించి బి ఎల్ ఎ-2 లకి వివరించినారు. ప్రతి ఓటు విలువైనదే దొంగ ఓట్లకు ఆస్కారం ఇవ్వకండి.
ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ కన్వీనర్ ఇండ్ల వెంకటరాఘవేంద్రరావు,ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగండిరఘురామయ్య,బిజెపి సీనియర్ నాయకులు మారుబొయిన శ్రీనివాసులు, మరియు కోవూరు మండల అధ్యక్షులు పోలిశెట్టి వెంకట సుబ్బారావు,బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్,బుచ్చిరెడ్డిపాళెం రూరల్ అధ్యక్షుడు సిద్దెన మనోహర్ రెడ్డి, కొడవలూరు మండల అధ్యక్షులు మర్కొండ శివకుమార్, విడవలూరు అధ్యక్షులు కొమ్మిరెడ్డి కోటారెడ్డి, మరియు నియోజకవర్గంలోని బిఎల్ఎ టోలు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.