
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం.
కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
