
భౌరంపేట్‌లో SIR కార్యక్రమాన్ని పరిశీలించిన BRS నాయకులు – ప్రతి ఓటరికి ఫారాలు అందించి పూర్తి చేయడంలో సహకరించాలని సూచన.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్, భౌరంపేట్ గ్రామ వార్డ్ కార్యాలయంలో నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) కార్యక్రమాన్ని ఈరోజు BRS పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా BLOలను కలిసి కార్యక్రమం అమలుపై వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.
అనంతరం భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా తమ SIR ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత BLOకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరికి SIR ఫారాలు తప్పనిసరిగా అందేలా చూడాలని, ఫారం నింపడంలో అవగాహన లేని వారికి BLOలు ప్రత్యేక చొరవ తీసుకుని సహాయం చేయాలని సూచించారు. ప్రతి ఓటరు SIR ఫారాన్ని పూర్తి చేసి BLOలకు అందజేయాలని, లేనిపక్షంలో ఓటు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.
ప్రతి ఓటు అమూల్యమని పేర్కొంటూ, BLOలు మరియు BLAలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , BRS నాయకులు పల్పునూరి విష్ణువర్ధన్ రెడ్డి , మన్నె శేఖర్ ముదిరాజ్ , కటకం విరేష్ , భౌరంపేట్ SIR సూపర్వైజర్ గౌతమ్ , BLOలు లలిత బాయి, సరిత, రమ, నీరజ, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
