
బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పేట బషీరాబాద్ (అంగడిపేట్) లో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకోవడం జరిగింది..
అనంతరం వారు మాట్లాడుతూ బొడ్రాయి మరియు ఆ అమ్మ వారి ఆశీస్సుల తో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు..
అనంతరం కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు…
ఈ కార్యక్రమంలో ఆర్ నరసింహ గౌడ్, ఆర్ మల్లేష్ గౌడ్, సంతోష్ గౌడ్, శ్రీధర్ గౌడ్, బాలప్ప,పులి సందీప్ గౌడ్, సురేష్, ఎం సందీప్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు..