నిజాంపేట్ 2BHK డిగ్నిటీ గృహాల్లో మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి రూ.45 లక్షల నిధులు – భూమి పూజలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

TEJA NEWS

నిజాంపేట్ 2BHK డిగ్నిటీ గృహాల్లో మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి రూ.45 లక్షల నిధులు – భూమి పూజలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్ 2BHK డిగ్నిటీ గృహాల సముదాయంలో మల్టీపర్పస్ హాల్ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.45 లక్షల నిధులను మంజూరు చేసింది. *రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి నిరంతర కృషి ఫలితంగా ఈ నిధులు మంజూరు కావడం పట్ల 2BHK హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా 2BHK హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మల్టీపర్పస్ హాల్ నిర్మాణ స్థలంలో ప్రత్యేక భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొలన్ హన్మంత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం కమిటీ సభ్యులు కొలన్ హన్మంత్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించి, కాలనీ అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, “నిజాంపేట్ 2BHK లబ్ధిదారుల సౌకర్యార్థం మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి రూ.45 లక్షల నిధులు మంజూరు కావడం ఎంతో సంతోషకరం. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, కాలనీల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఈ నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ తీసుకున్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి కుత్బుల్లాపూర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో 2BHK హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ నివాసితులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top