
రోడ్డు అక్రమణలను అడ్డుకోండి.
జోనల్ కమిషనర్ కి సిపిఐ వినతిపత్రం.
కుత్బుల్లాపూర్ జోనల్ పరిధిలోని చింతల్ సర్కిల్ మరియు మహాదేవపురం,గాజులరామారం సర్కిల్లోలో రోడ్డులను ఆక్రమించుకుంటూ నిర్మాణాలు సాగిస్తున్నారని దానివల్ల రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఈ విషయాన్ని గతంలో కూడా అన్ని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీసులలో వినతిపత్రం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని కావున వెంటనే రోడ్లు ఆక్రమణ కు గురికాకుండా చర్యలు తీసుకోవాలని నేడు సిపిఐ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ని కోరడం జరిగింది.
ముఖ్యంగా జగద్గిరిగుట్ట పరిధిలోని పైప్లైన్ రోడ్ సిపిఐ ఆఫీస్ లైన్ బీరప్ప నగర్ కొత్తగా వేసినటువంటి రోడ్డులపై నిర్మాణాలు జరుగుతున్నాయని గతంలో మున్సిపల్ సిబ్బంది తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం వల్ల మళ్లీ అవి ఇప్పుడు శాశ్వత నిర్మాణాలుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే మరోసారి అలాంటి నిర్మాణాలు కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ విషయాలపై స్థానిక సిబ్బందికి తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవట్లేదని, దానిపై ప్రజల్లో అనేక అపోహాలు ఉన్నాయని స్థానిక సిబ్బంది వారికి సహకరిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని కాబట్టి ప్రభుత్వం పైన చెడ్డ పేరు రాకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా విధులను సక్రమంగా నిర్వహిస్తే ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉండవని జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే రాగి నారాయణ రెడ్డి నగర్ లో బాక్స్ నాలను నిర్మించే సమయంలో రోడ్డును తవి వదిలేయడం వల్ల ప్రజలకు వెళ్లడానికి తీవ్ర అసౌకర్యం కలుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు సదానంద సహదేవరెడ్డి వెంకటేష్ కొండయ్య శ్రీనివాస్ జంబ ూ మహేష్ యాగంటి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
