
‘జోహార్లు ఎంచర్ల సాత్విక్’ నినాదాలతో మార్మోగిన గోదావరిఖని….
ఏఐఎస్ఎఫ్–ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఘన నివాళి….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,
రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థి ఎంచర్ల సాత్విక్కు ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. “జోహార్లు ఎంచర్ల సాత్విక్” నినాదాలతో ప్రధాన చౌరస్తా మార్మోగింది.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి బైరిమల దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ, క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన సాత్విక్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించి సాత్విక్‌కు ఘన నివాళులు అర్పించినట్లు తెలిపారు.
సాత్విక్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఘటనకు బాధ్యులైన పీఈటీ, ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌యూఐతో పాటు విద్యార్థి, ప్రజా సంఘాలు నిర్వహించిన నిరసనకు స్పందించిన పెద్దపల్లి ఆర్డీఓ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మీడియా సమక్షంలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నివాళి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కుంటు సాగర్, సురేష్, ధనాల మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
