
శేరిలింగంపల్లి ఇన్చార్జులు కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు మరియు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు సూచనల మేరకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ERO( ఎన్నికల నమోదు అధికారి) SIR (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు .
రంగారావు గారు మాట్లాడుతూ ఇప్పటివరకు స్వీకరించిన ENUMERATION FORMS పంపిణీ చేసిన సంఖ్య మరియు పెండింగ్ ఫార్మ్స్ మరియు వచ్చిన ఫార్మ్స్ వివరాలు , మరణించిన ఓటర్లు షిఫ్టెడ్ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లకు సంబంధించిన వివరాలు , మ్యాపింగ్ అండ్ అన్ ఓటర్ల వివరాలు ప్రతిరోజు పొలిటికల్ పార్టీస్ కి ఇవ్వవలసిందిగా బిఎల్ఓ లకి ఫారం లో నింపే విషయంలో గానీ డిజిటల్ చేసే విషయంలో గాని పూర్తిగా అవగాహన లేదు కాబట్టి మరొకసారి వారికి ట్రైనింగ్ ఇప్పించి ఎస్ ఐ ఆర్ కార్యక్రమము దిగ్విజయం అయ్యే విధంగా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రోజా, శ్రీనివాస్ గౌడ్, సతీష్ రావు, శ్రీకాంత్ ముదిరాజ్ ,కిరణ్ యాదవ్, గోపు శ్రీనివాస్, రామకృష్ణ, మల్లేష్, అల్లావుద్దీన్ పటేల్, సంతోష్, శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.