
జాతీయ చేనేత దినోత్సవం అభినందనలు తెలిపిన టిడిపి నాయకులు
ఇంటింటికి టిడిపి
పాటూరు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు చేనేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగాతెలుగుదేశం పార్టీనాయకులుమాట్లాడుతూ.. భారతీయసంస్కృతిని చాటే చేనేత కళను ముందుకు తీసుకువెళుతున్న చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే ‘నేతన్న సేవలో’ పథకం కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. విద్యుత్ రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ నేతన్నలకు దన్నుగా ఉన్నాం. నేడు 71,536 చేనేత కుటుంబాలకు ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా సాయం చేస్తున్నారు. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున రూ.179 కోట్లు నేతన్నలకు అందిస్తున్నారు. చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సాయం అందిస్తోంది. అంతా చేతులు కలుపుదాం.చేనేత కళను కాపాడుదాం.
ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన విజయవంతం సందర్భంగా చేనేత కార్మికుల అందరితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో. పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి,కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుకొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ కోవూరు టౌన్అధ్యక్షులుఇంతామల్లారెడ్డి,పెండెం వెంకట శేషయ్య,పులి సురేష్,వంశీ,ప్రసాద్, శివారెడ్డి,యానాదయ్య, దయాకర్,ఏడుకొండలు, రామయ్య,బైన పుల్లయ్య, శివ,సుధాకర్,శ్రీనివాసులు, తదితరులు పాల్గొనడం జరిగింది.