
సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ మరియు కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు గాజులరామారం సర్కిల్ పరిధిలోని గాజులరామారం చౌరస్తా నుండి మహాదేవపురం వరకు ఉన్న రహదారి ఆక్రమణలను అధికారులు తొలగించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. సర్కిల్ పరిధిలో అక్రమ కట్టడాలు కట్టినిచో అట్టి అక్రమ కట్టడాలుపై కఠిన చర్యలు తీసుకోబడునని గాజులరామారం ఉప కమిషనర్ U.VENKAT RAMULU హెచ్చరించారు . ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ACP) ఆర్. సుమిత్ర, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ (TPS) బి. సరిత సేన్ తమ సిబ్బందితో కలిసి పాల్గొని పర్యవేక్షించారు. రహదారులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.