
దేశంలోనే ఏ ఐ ఎస్ ఎఫ్ మొట్టమొదటి విద్యార్థి సంఘం.
ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉమా మహేష్.
అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా షాపూర్ నగర్ లో ఏర్పాటుచేసిన ఏఐఎస్ఎఫ్ పథకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అందరిని ఐక్యం చేసి పోరాటం నిర్వహించిన ఘనత ఈ దేశంలో కేవలం ఏఐఎస్ఎఫ్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. స్వాతంత్ర అనంతరం విద్యార్థులకు అందరికీ ప్రభుత్వమే బాధ్యతగా ఉచిత విద్యను అందించాలని శాస్త్రీయమైనటువంటి విద్యనందించాలని చదువుకున్న విద్యార్థి ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యార్థులను రాజకీయాల్లోకి వచ్చి విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు నిర్మించాలని సదుద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఏఐఎస్ఎఫ్ కు ఉన్నదని అన్నారు.
నేడు ఢిల్లీలో మరియు జార్ఖండ్ లో జరిగిన విద్యార్థి ఉద్యమంలో కూడా ఏఐఎస్ఎఫ్ తన వంతు పాత్ర నిర్వహించి ప్రభుత్వాల మెడలను వచ్చే విధంగా కృషి చేసిందని, అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లుగా ఉన్న వారికి మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయని అందుకే విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి వచ్చి మంచి విద్యా వ్యవస్థ కోసం పోరాటాలు నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వంశీ జస్వంతులు నాయకత్వం వహించగా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీనివాస్, స్వామి హాజరు కాగా విద్యార్థి సంఘ నాయకులు మహేష్ మహేందర్ శ్రీనివాస్ రమేష్ వినయ్ కీర్తిల తో పాటు సిపిఐ నాయకులు హరినాథ్ సంకిరెడ్డి నరసింహారెడ్డి లు తదితరులు పాల్గొన్నారు.