ఇంటింటికీ ప్రచారం కూటమికెంతో కీలకం:- ఎమ్మెల్యే జూలకంటి

TEJA NEWS

ఇంటింటికీ ప్రచారం కూటమికెంతో కీలకం:- ఎమ్మెల్యే జూలకంటి

కారంపూడి కాకతీయ రిపోర్టర్ కల్లూరి. గోపి

ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారం కూటమి పార్టీలకు ఎంతో కీలకమని, అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహం నందు స్థానిక కూటమి పార్టీల శ్రేణులను సమావేశపరిచి, ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమంపై సమీక్షించారు.ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన ప్రచారం శైలిని అడిగి తెలుసుకున్నారు. నిర్ణిత సమయంలో ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేయాలని
దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అందిస్తున్న సంక్షేమం, చేపట్టిన అభివృద్ధిని ప్రతి ఇంటికి వెళ్లి తెలియ చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పంగులూరి అంజయ్య, ఎంపీపీ బొల్నేడి శ్రీనివాసరావు, మునుగొటి సత్యం, చప్పిడి రాము, బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ, శేషగిరి రావు, కొదాటి ప్రభాకర్, పంగులూరి లక్కీ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top