
భౌరంపేట్ శ్రీ దుర్గాదేవి ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ శ్రీ దుర్గాదేవి ఆలయ నూతన కమిటీని గ్రామ నాయకులు, పెద్దలు, భక్తుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడిగా వెంకట్రామ్ ఆనంద్ రెడ్డి ని, వైస్ ప్రెసిడెంట్లుగా V. సుభాష్ రెడ్డి , K. సందీప్ చారి ని, ట్రెజరర్‌గా E. లక్ష్మీకాంత్ రెడ్డి ని, జనరల్ సెక్రటరీగా దుబ్బ విష్ణు ని, జాయింట్ సెక్రటరీగా K. నవీన్ చారి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే కార్యవర్గ సభ్యులుగా E. కృష్ణ రెడ్డి, E. జాంగా రెడ్డి, G. బుచ్చిరెడ్డి, N. హన్మంత్ రెడ్డి, చింత వెంకటేష్, నామాల రాము, D. మహేష్, CH. శ్రీకాంత్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను గ్రామ పెద్దలు, నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి కోసం నూతన కమిటీ సభ్యులంతా ఐక్యంగా పనిచేస్తూ, గ్రామస్తులు మరియు భక్తులను కలుపుకొని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. ఎటువంటి భేదాభిప్రాయాలకు, బేషజాలకు తావులేకుండా అందరూ కలిసి పనిచేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు