
రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
గాంధీ భవన్ (హైదరాబాద్): గాంధీభవన్లోని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి వేదమంత్రోచ్ఛారణలు, పార్టీ శ్రేణుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షురాలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటానికి పారిజాత నర్సింహారెడ్డి నాయకత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు వి. హనుమంత్ రావు, చల్లా నర్సింహారెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, సరితా తిరుపతయ్య, చరణ్ కౌశిక్ యాదవ్, రఘునాథ్ యాదవ్, కాల్వ సుజాత, సామ రామ్మోహన్ రెడ్డి తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని నూతన అధ్యక్షురాలిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
