రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Spread the love

రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండలో 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ప్రారంభం

హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహిస్తున్న 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య లాన్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ,హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ తో కలసి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అక్టోబర్ 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో అండర్‌-17, అండర్‌-19 విభాగాల్లో బాలబాలికలు పాల్గొంటున్నారు. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను అలవర్చుతాయని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిభను నిరూపించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, నిర్వాహకులు, అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top