TEJA NEWS

ముఖరా కే లో ముందస్తుగానే ప్రారంభమైన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ 25 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు”
“ఔర్ ఏక్ దక్కా కేసీఆర్ పక్కా ”
మళ్ళీ వచ్చేది మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని ప్లెక్సీలు పెట్టి పార్టీ జెండాలు పట్టి జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు చేస్తూ వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకున్న ముఖరా కే గ్రామస్తులు…..

సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ ముఖరా కే గ్రామంలో ముందస్తుగానే పార్టీ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం అయ్యాయి అని,మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని నెల రోజుల పాటు ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటామని, మళ్ళీ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే వచ్చేది కారు పార్టీ అని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని ఎందుకంటె కేసీఆర్ హాయంలో తెలంగాణ లోని ప్రతి పల్లెలో సంక్షేమ పథకాలు అందాయి అని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది అని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది అని సరిగ్గా సంక్షేమ పథకాలు అందుతలేవు అని, అభివృద్ధి జరుగుతలేదు అని, కాంగ్రెస్ హామీలన్నీ బోగస్ అయ్యాయని, కాంగ్రెస్ పాలనలో పల్లెలని చెత్త కుప్పలయాయాన్ని, ఆరు గ్యారంటీలు అమలు అవుతలేవు అని, తెలంగాణలోని ప్రతి వర్గం బాగుపడాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని, కేసీఆర్ వస్తేనే తెలంగాణ లోని ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని సర్పంచ్ గాడ్గే మీనాక్షి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు