TEJA NEWS

ప్రతి రేషన్ షాపు ముందు నరేంద్రమోడీ ఫోటో పెట్టాలి

  • బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్

నాగర్ కర్నూల్ జిల్లా
కల్వకుర్తి మున్సిపాలిటీ సిల్లారుపల్లిలోని 9వ రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ పథకం బిజెపి నాయకులు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈఉగాదికి ప్రారంభించిన 6కేజీల సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా 5కేజీలు ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని అందుకు అనుగుణంగా కలెక్టర్లు ఆర్డీవోలు ఎమ్మార్వోలు రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని లేని యెడల బిజెపి నాయకులు ఉరువాడ తిరిగే ప్రజల ముందుకు మీ కుట్రలను బయట పెడతామని కల్వకుర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్ హెచ్చరించారు…
ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నీరు కంటి రాఘవేందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బృంగి వివేకానంద, మాజీ అధ్యక్షులు బోడ నరసింహ, గుండోజో గంగాధర చారీ,బీజేవైఎం జిల్లా సెక్రెటరీ ధన్నోజు నరేష్ చారి, నాయకులు మిరియానం శ్రీకాంత్, పెద్దారి పర్వతాలు, నాప శివ, తోడేటి అరవింద్ రెడ్డి,దేవర్ల కుమార్, రేషన్ డీలర్ మహమ్మద్ సిరాజుద్దీన్, లబ్ధిదారులు పాల్గొన్నారు.