TEJA NEWS

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..

ఏఐసీసీ పిలుపు మేరకు..

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు..

మంచిర్యాల నియోజకవర్గంలో లక్షెట్టీపేట్ మండలంలో పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లో 5వ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ..

ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి, మహాత్మా గాంధీ, డా.బి.ఆర్ అంబేద్కర్, రాజ్యాంగ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు..

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రతిజ్ఞ చేసారు..

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతు భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబెడ్కర్ ని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.

ఈ పాదయాత్ర మండల నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు‌‌..