TEJA NEWS

ఇల్లు కాలిపోయిన ఆదివాసి కుటుంబాలనీ ప్రభుత్వం ఆదుకోవాలి, తంబళ్ల రవి.

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి డిమాండ్

ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద 50,000 ఇవ్వాలి

ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి మండలానికి ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలం పాల గుంపు గ్రామంలో ఇల్లు కాలిన ఆదివాసి కుటుంబాలను పరామర్శించిన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబల్ల రవి, మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం ప్రమాదవశాస్తూ నాలుగు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి,నాలుగు కుటుంబాలు పూర్తిగా సర్వం కోల్పోయారు,స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వం స్పందించి ప్రతి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కింద 50 వేల రూపాయలు అందించాలీ,ఇల్లు కాలిన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు శాంక్షన్ చేయాలీ,అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి మండలానికి ఒక ఫైర్ ట్యాంకర్ అందుబాటులో ఉండేలా చూడాలనీ తంబల్ల రవి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు తోట రాజా,గంటా లక్ష్మణ్ రావు,పార్ధు,కేశవులు,తదితరులు పాల్గొన్నారు.