TEJA NEWS

మహానుభావులు ఇచ్చిన స్ఫూర్తి తోటి శాసనమండలి లో పేద ప్రజల గొంతుకనైత.
సిపిఐ శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం.

ఏఐటీయూసీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కౌన్సిల్ సమావేశం సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం రావడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ధనవంతులు వ్యాపారస్తులకు నిలయమైనటువంటి పార్లమెంటు అసెంబ్లీ నేడు ఒక రైతుబిడ్డగా శాసన మండల సభ్యునిగా నన్ను కమ్యూనిస్టు పార్టీ పంపించడం చాలా గర్వకారణమని పార్టీ నాయకులైనటువంటి ధర్మ బిక్షం ఇచ్చినటువంటి స్పూర్తితో రానున్న రోజుల్లో ప్రజల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తానని కాంగ్రెస్ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిచేసే వరకు ప్రజల తరఫున మాట్లాడతానని అన్నారు. గతంలో పార్లమెంటులో శాసనమండలం కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై చర్చించేవారని కానీ నేడు పార్లమెంటు అసెంబ్లీ వ్యాపారస్తులకు రౌడీలకు, డబ్బులు ఖర్చు పెట్టే వారితో నిలయం అయిందని వారికి భిన్నంగా ప్రజా సమస్యల కోసమే పనిచేస్తానని అన్నారు. మనుషులు బలహీన పడలేదని కమ్యూనిజం బలహీన పడలేదని ప్రజలు తెలుసుకుంటున్నారని కావున కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండి వారి సమస్యల కోసం పనిచేస్తే రానున్నది కమ్యూనిజమే అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కార్మికుల హక్కులను కాల రాస్తున్నాయని, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆర్ టి సి లో యూనియన్ ను నిషేదించారని మళ్ళీ యూనియన్ లను పునరుద్దరించుకుంటే కార్మికులకు న్యాయం జరుగుతుందని దాని కోసం మన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కృషి చెయ్యాలని,కార్మికుల,రైతుల,యువజనుల సమస్యలను ప్రస్థావించేది కేవలం కమ్యూనిస్టులేనని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి అధ్యక్షతన ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు ఏసురత్నం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్,రవి చందేర్, హరినాథ్ రావు,తులసి,మహేందర్,ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్, రాములు,ఏఐటీయూసీ నాయకులు బిక్షపాతి,యాదయ్య, కృష్ణమూర్తి,నర్సింహా రెడ్డి,స్వామి, సామెల్, యాదగిరి, రమేష్,సుంకి రెడ్డి,కమలమ్మ,కృష్ణ,శ్రీనివాస్,ముసలయ్య లతో పాటు అనేక యూనియన్లకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.
శాసనమండలి సభ్యులు సత్యం ని సన్మానించడం జరిగింది.