TEJA NEWS

చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

సూర్యపేట జిల్లా : పెరిగిన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఉచితంగా దాహార్తిని అందించేందుకు సహృదయంతో ముందుకొచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ధర్మపీఠం ఆధ్యాత్మిక ప్రచార వేదిక వ్యవస్థాపకులు వంశీకృష్ణ ను అదేవిధంగా టెంట్ హౌస్ రాము లను తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్ పాత్రికేయులు కందుకూరి యాదగిరి ప్రత్యేకంగా అభినందించారు.గురువారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట పట్టణానికి చుట్టుపక్కన ఊర్ల నుండి ఎంతోమంది వారి అవసరాల నిమిత్తం వస్తుంటారని అదేవిధంగా స్థానిక ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని
చన్నీళ్లు అందించి దాహార్తిని తీర్చే విధంగా చక్కటి కార్యక్రమాన్ని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన రావడం అభినందనీయమన్నారు.

జ్యూస్ లు కొబ్బరి బోండాలు శీతాకాల పానీయాలు తాగాలంటే ఆ ధరలు పెట్టి తాగలేని వారు ఎంతో మంది నిరుపేదలు ఉంటారు.వారికి సరిపోను డబ్బు లేక ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి సైతం చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ఏర్పాటు చేసిన వారిని చల్లగా దీవించాలని మనస్పూర్తిగా తాము కోరుకుంటున్నామని తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని అసోసియేషన్ తరపున జర్నలిస్టుగా తాను అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు అసోసియేషన్ కమిటీ సభ్యులు తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు