
ఉచిత వైద్య శిబిరాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
132 – జీడిమెట్ల డివిజన్ అయోధ్య నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో “గ్రేస్ క్యాన్సర్ హౌండేషన్ మరియు బైబిల్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పేద ప్రజలకు వైద్యశిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని, ఈ వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగ పరుచుకోవాలి. మానవ సేవయే పరమావధిగా ముందుకు సాగుతున్న గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ కు, పేదలు అధికంగా నివసించే అయోధ్య నగర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటుచేసిన బైబిల్ మిషన్ కు నా అభినందనలు.
ఈ కార్యక్రమంలో బైబిల్ మిషన్ పాస్టర్ చిట్టి బాబు, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, జిహెచ్ఎంసి డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నదీమ్ రాయ్, ఎల్లా గౌడ్, విజయ్ హరీష్, శ్రీకాంత్, గుబ్బల లక్ష్మీనారాయణ, పందిరి యాదగిరి, అయోధ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యేసు, ఉపాధ్యక్షులు ఉమేష్ సింగ్, కోశాధికారి సత్యనారాయణ, సభ్యులు బాల్ రాజ్ గౌడ్, సోమనర్సయ్య, మహిళా నాయకురాలు నర్మదా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
