TEJA NEWS

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, కాలనీల సభ్యులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్భంగా వారి ప్రాంతాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కె.పి వివేకానంద దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు… అదే విధంగా పలు ప్రాంతాలలో జరగబోయే వివిధ శుభకార్యాల వేడుకల్లో మరియు వివాహ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేశారు…