
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని కలిసినా మైనారిటీ నాయకులు ||
( కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 125 డివిజన్ రుడా మేస్త్రి నగర్ నిరుపేద మైనారిటీ నాయకులు కైసర్ నగర్లోని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కొరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి విన్నపించగా సానుకూలంగా స్పందించి అతి త్వరలో అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మైనారిటీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియ దళిత సేన అధ్యక్షులు డా || అవిజే జేమ్స్, డీసీసీ ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, ఎండి అజమ్, రహీమ్, ఖలీమ్, మైనారిటీ నాయకులు సుల్తాన్ మీర్జా, కయ్యుమ్, రాకేష్, ఆఫీజ్, ముస్తఫా, షాహిన్ బేగమ్ మరియు తదితరులు పాల్గొన్నారు
