
అయ్యప్ప ఆలయం ఎదురు గా ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముగ్గు
సాక్షిత వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు రాజనగరం రోడ్డు నందు అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న స్థలం లో ఆంజనేయ స్వామి నూతనంగా ఆలయం నిర్మాణం చేపట్టడం కోసం యాదగిరి గుట్ట ఆలయం స్థపతి రఘువీర్ చేత స్థలం చూపించి ముగ్గు పోయడం జరిగింది,ఇక్కడ ఆలయం నిర్మిస్తే చాలా దివ్యంగా ఉంటుందని,కార్తీక మాసం లోఎదురుగా ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం నందు అయ్యప్ప స్వామి, శివ స్వాములు దీక్ష లతో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి మాల ధారణ వేసుకొని దీక్ష లు చేయొచ్చు అని అన్నారు అయ్యప్ప ఆలయం అధ్యక్షులు బొల్లంపల్లి నగేష్ మాట్లాడుతు గత నెల నుండి ప్రతి అమావాస్య రోజున అయ్యప్ప ఆలయంలో అన్న ప్రసాద కార్యక్రమం చేపడుతున్నమని , రాబోయే రోజులలో నిత్య అన్న ప్రసాదం నిర్వహిస్తామని అన్నారు మైక్ రామ్ చందర్ కుమారుడు విజయ్ మాట్లాడుతూ మా స్థలం లో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కార్యక్రమం లొ రాము ఓల్డ్ ఏజ్ హోం, సందీప్, సాయి లు పాల్గొన్నారు
