Spread the love

విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులతో పాత్ర ఎంతో కీలకం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

125 – గాజులరామారం డివిజన్ కైసర్ నగర్ నందు గల వాగ్దేవి స్కూల్ లో ఏర్పాటుచేసిన “సైన్స్ ఫెయిర్” ను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, పిల్లలు నూతన ఆవిష్కరణలు చేసే విధంగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్,
జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, వార్డు సభ్యులు మక్సూద్, అజయ్ ప్రసాద్, నాయకులు తారా సింగ్, చిన్నా చౌదరి, ఆసిఫ్, జునైద్, ప్రసాద్, పాఠశాల కరస్పాండెంట్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.