Spread the love

శివ స్వాములపై దాడి.. రాజాసింగ్ సీరియస్

శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు దాడి చేయడం దారుణమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శ్రీశైలం దేవస్థానానికి వెళ్లిన స్వాములపై దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివస్వాములు ఓ దుకాణాదారుడితో వాగ్వాదం కాగా అక్కడి పోలీసులు శివస్వాములపై ఎలా లాఠీచార్జ్ చేస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం, డీజీపీ స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.