
ఘట్కేసర్ మున్సిపల్ 1వ వార్డు లోని NFC నగర్ మరియు కొండాపూర్ లో 12 లక్షల నిధులతో నిర్మిస్తున్న CC రోడ్డు పనులు పరిశీలిస్తున్న ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ,
ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ NFC నగర్ మరియు కొండాపూర్ లో 12 లక్షల నిధులతో నిర్మిస్తున్న పనులను స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ తో కలిసి పరిశీలించడం జరిగింది అని, రానున్న రోజుల్లో ప్రతి వార్డు లోని వాడ లను అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి తప్పకుండ చేస్తానని తెలుపుతూ సంబంధిత కాంట్రాక్టర్ కి రోడ్డు నిర్మాణ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నాణ్యమైన సిమెంట్ వాడాలని సూచించారు…
ఈ కార్యక్రమం లో స్థానిక మాజీ కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ చిలుగురి గోపాల్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజు ముదిరాజ్ , మాజీ సర్పంచ్ రమేష్ , BRS నాయకులు ఇమ్మడి యాది రెడ్డి , తదితరులు పాల్గొన్నారు….
