Spread the love

3వ అంతర్జాతీయ తెలుగు భాష సమావేశాలకు డా: బానోత్ స్వామి

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం తిరుపతి మరియు ప్రాచ్య పరిశోధన సంస్థ తిరుపతి వారు ఫిబ్రవరి 27, 28, 2025 తేదీలలో సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడవ అంతర్జాతీయ తెలుగు భాష సమావేశాలకు కాకతీయ విశ్వ విద్యాలయం నుండి డాక్టర్ బానోత్ స్వామికి ఆహ్వానం అందింది. ఈ సమావేశాలలో డాక్టర్ బానోత్ స్వామి “తెలంగాణ లో అంతరించి పోతున్న గిరిజన మౌఖిక భాషలు” అనే అంశం మీద పత్ర సమర్పణ చేయనున్నారు. అంతర్జాతీయ భాష సమావేశాలకు ఆహ్వానం లభించిన డా: స్వామికి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ తాళ్లపల్లి మనోహర్, తెలుగు శాఖ అధ్యక్షులు మామిడి లింగయ్య, తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్ డాక్టర్ మంథని శంకరయ్య, కేయూ పాలకమండలి సభ్యులు చిర్ర రాజు, డా: స్వామిని అభినందించారు.