
ఏపీలో 75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్
ఏపీలో విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్మెంట్ అందిస్తామని స్పష్టం చేసింది. FRSకు కావాల్సిన టెక్నాలజీని APTS అందిస్తుందని, దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా
ఉంటుందని వివరించింది.
