
బంగారం అక్రమ రవాణా కేసు.. కన్నడ నటికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ
సీనియర్ పోలీసు అధికారి కుమార్తె, ప్రముఖ నటి రన్య జైలు పాలైంది.
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం కోర్టులో హాజరుపరుచగా ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలిచ్చింది.
దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు.
రన్యా రావును మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని జడ్జి ఆదేశాలిచ్చారు.
ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాలను జారీ చేశారు.
రన్యా బంగారు కడ్డీలతో బెంగళూరుకు వచ్చింది. అయితే ఢిల్లీ DRI బృందానికి రన్యా స్మగ్లింగ్ గురించి ముందుగానే సమాచారం అందింది. విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు నటిని అదుపులోకి తీసుకున్నారు.
