
ప్రజలందరికీ మహా శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు.
ఆ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ *
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో గల శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం మరియు ధీనబంధు కాలనీ లో గల శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి, అభయాంజనేయ స్వామి, నవగ్రహ, గణపతి మరియు నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పరమేశ్వరునికి అభిషేకం చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినం. శివుడికి అత్యంత ఇష్టమైన రోజు , శివరాత్రి నాడు వాడ వాడల రోజు వారీ ఉపవాస దీక్షల తో , జాగారం తో వేడుక చేసుకుంటారు. ఆ పరమ శివుడిని ఆరాధిస్తూ పర్వశించే పవిత్ర రోజు మహా శివరాత్రి రోజు అని, ఉపవాసాలు, జాగరణలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహా శివున్ని కొలిచే పర్వదినం మహా శివరాత్రి.ప్రజలందరిపై ఆ మహాదేవుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తూ..మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సమస్త భక్త జనకోటికి మహా శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేశారు.అదేవిధంగా శివుడు మహా తపస్వి, లోక క్షేమం కోసం చేసే తపస్సు అది, ఏ మంచి పని అయిన దీక్ష తో ఓ తపస్సులా ఆచరించాలని దేనికి చలించరాదు అని, ఈ విశిష్టతనే శివతత్వం బోధిస్తుంది అని, శివ శబ్దం మంగళాత్మకం అని , అందుకే శివుడు అనే పేరు ఎన్నో శుభాలను సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే ,అనేక గుణాలకు నిలయుడైన వాడు శివుడు ,ఆయనను లోకమంతా ఆరాదిస్తుంది అని, శివ నామాన్ని జపిస్తుంది ,ఆయన దర్శనం కోసం తపిస్తుంది అని, ఇదే శివతత్వం అని మహా శివరాత్రి పర్వదిన ప్రత్యేకం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు, పురెందర్ రెడ్డి, అల్లం మహేష్, ఎల్లం నాయుడు ,ఆస్బెస్టాస్ కాలనీ ప్రెసిడెంట్ నరేష్, ప్రసాద్ , భాస్కర్ రెడ్డి, అశోక్, బాలు, సుభాష్ , నర్సింగ్ రావు, రమణ, మహేష్, శ్రీహరి గుడ్ల కొండ బాలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
