Spread the love

చిలకలూరిపేట పట్టణం స్థానిక సుబ్బయ్య తోట నందు
శ్రీచైతన్య టెక్నో స్కూల్ క్యాంపస్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట డి.ఈ.ఈ అశోక్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1986లో అప్పటి ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించింది. ఈ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రాథమిక లక్ష్యం దేశంలోని విద్యార్థులకు సైన్స్ రంగం పట్ల ఆసక్తి కలిగేలా చేయడం.. కొత్త ప్రయోగాల వైపు వాళ్లను ప్రేరేపించడం.

అంతేకాదు వారిని సైన్స్ వైపు ఆకర్షించడం, వైజ్ఞానిక విజయాలపై అవగాహన కల్పించడం అన్నారు. అనంతరం విద్యార్థుల ప్రొజెక్ట్స్ స్మార్ట్ సిటీ, డ్యాం, డైజెస్టివ్ సిస్టం హైడ్రో ఎలక్ట్రిసిటీ, బయోగ్యాస్ ప్లాంట్, యానిమల్ హాబిటేషన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చూసి వారి ప్రతిభను అభినందించారు.విద్యార్థులు ఈ రకమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ తో ఎంతో పురోగతిని సాధిస్తారు అని పేర్కొన్నారు.విద్యార్థులను ఈ విధముగా ప్రోత్సహిస్తున్న శ్రీచైతన్య మేనేజ్మెంట్ నీ టీచర్లు నీ పేరెంట్స్ నీ అభినందించారు.అనంతరం పలువురు విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ కోటేశ్వరరావు,పోతురాజు, స్కూల్ మేనేజ్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.