TEJA NEWS

ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారంలో వచ్చే నెల 11వతేదీన జరిగే బొడ్రాయి పండగకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించారు.బొడ్రాయి పండగ నిర్వాహకులు మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు జూకూరి గోపాలరావు,మాజీ సర్పంచ్ వాసంశెట్టి వెంకన్న,కందునూరి ఏడుకొండలు, భండారు శ్రీనివాస్, ఉపేందర్ తదితరులు మంగళవారం ఎంపీ రవిచంద్రను కలిశారు.పెరికసింగారంలో డిసెంబర్ 11వతేదీన శ్రీముత్యాలమ్మ,గంగమ్మ,మారెమ్మ,చెట్టుదేవర, పోతురాజు పరివార సహిత శ్రీనాభిశిల (బొడ్రాయి)అమ్మ వార్ల ప్రతిష్ఠా మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా కోరుతూ ఎంపీ వద్దిరాజుకు ఆహ్వాన పత్రికను అందజేశారు.


TEJA NEWS