Tag: ఎంపీ

ఉండి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపైఇ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందన్నారు. వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు.…

మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి మొన్న జరిగిన ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియాజకవర్గం లో బూత్ల వారీగా వోటింగ్ శాతం, వివిధ అంశాలపై చర్చించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ అన్ని డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్‌ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ కార్డు వెరిఫికేషన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నియోజకవర్గంలోని పలు బూత్‌లను మద్వీరా సందర్శించారు. అక్కడున్న వారిని వెతికి పట్టుకుని ముస్లిం మహిళలు బురఖాలు తొలగించాలని కోరారు. అంతేకాకుండా ఆమె ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులను కూడా తనిఖీ…

చేవెళ్ల గడ్డపై రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపల్ కేంద్రంలో గల పోలింగ్ బూత్ లను కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజలంతా బిజెపికే ఓటు వేశారని నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ఘన విజయం…

చేవెళ్ల మండల కేంద్రంలో బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సంగీత రెడ్డి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్ళు ఓటు వేశారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటికి రావాలని, తమ ఓటును సరైన నాయకుడికి వేసి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంకేపల్లి లో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. అనంతరం ఎంపీని శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీని కలిసిన వారిలో రాజేశ్వర్ గౌడ్, రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు.

మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి లోని KVR కన్వెన్షన్ హాల్ నందు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజానోళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ్ సమ్మేళనం కి ముఖ్య అతిధిగా అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లాంబ , రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు , ఏఐసీసీ కుత్బుల్లాపూర్ పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వెర్ జ్యోతి మణి…

చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం సర్తాజ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు రెండోసారి పంపాలని ఓటర్లను కోరారు.