
శాసన మండలి ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా జనసేన, బీజేపీ మద్దతుతో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల అధినేత, మాజీ శాసన సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అత్యధిక ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించటం గర్వకారణం. ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం అవనిగడ్డ నియోజకవర్గంలో నిర్విరామంగా శ్రమించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం, మార్గదర్శకాలు అనుసరించి అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రణాళికతో పని చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి కూటమి అభ్యర్థిగా ప్రకటించక ముందే మన అవనిగడ్డలో ఆయనను ఆహ్వానించి ఆయనకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభ విజయవంతం చేసిన రోజు నుంచి ఎన్నికల రోజు వరకూ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు శ్రమించిన తీరు అద్భుతం. ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం మనతో కలిసి ప్రచారంలో భాగస్వాములు అయిన రాష్ట్ర మంత్రులు వాసంశెట్టి సుభాష్ కి, కొల్లు రవీంద్ర కి, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు కి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు కి అభినందనలు. మన అందరి సమిష్టి కృషి, సహకారం ఫలితంగా అపూర్వ విజయాన్ని అందుకున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ నియోజకవర్గ శాసన సభ్యులు
మండలి వెంకట్రామ్
అవనిగడ్డ నియోజకవర్గ యువనాయకులు
