
ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని మార్చుదాం.
కమిషనర్ ఎన్.మౌర్య
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్థానిక అన్నమయ్య కూడలి నుండి దండి మార్చ్ (ఎమ్మార్ పల్లి) కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మానవాళికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని చేపడుతున్నామని అన్నారు.
120 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ వస్తువులు వినియోగించారాదని అన్నారు. ఈ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా గుడ్డ బ్యాగుల, పేపర్ కవర్లు వినియోగించేలా ప్రజలకు దుకాణదారులు అవగాహన కల్పించాలని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్లాస్టిక్ నిషేధానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారని అన్నారు. బయటి ప్రాంతాల నుండి ఎక్కువ ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయని వాటిని అరికట్టాలని కోరారని అన్నారు. కలెక్టర్ తో చర్చించి వాటి నియంత్రణకు చర్యలు చేపడతామని అన్నారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలు చేస్తామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీ లో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.సి.పీ. మహా పాత్ర, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డి.ఈ.లు మహేష్, రాజు, రమణ, మధు, లలిత, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, మెప్మా కృష్ణవేణి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
